ఉచిత ఆఫర్లకు తెరలేపిన జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ - Jio Gigafiber broadband open to free offers - FLS
ముకేష్ అంబాని నేతృత్వంలో
గల రిలయన్స్ సంస్థ తన జియోఫైబర్ ను ప్రకటించిన సంగతి అందరికి తెలిసింది. ఇప్పుడు
చాలా కాలం సుదీర్ఘ ఎదురుచూపు తరువాత జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఈ రోజు
సెప్టెంబర్ 5 న భారతదేశంలో
వాణిజ్యపరంగా ప్రారంభించబడుతోంది. రిలయన్స్ జియో ఇటీవలి తన వార్షిక సమావేశంలో జియో
ఫైబర్ సేవలు వినియోగదారులకు రూ .700 ప్రారంభ ధర వద్ద 100 ఎమ్‌బిపిఎస్ డేటా వేగంతో లభిస్తాయని
వెల్లడించారు.
ఉచిత ఆఫర్
ఉచిత ఆఫర్లకు
కేంద్రబిందువుగా వున్న జియో టెలికామ్ రంగంలోకి ప్రవేసించినప్పుడు ఇలా అయితే ఉచిత
ఆఫర్లను అందించిందో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కూడా అదే పంథాను అవలంబిస్తోంది.
జియోఫైబర్ అని పేరు మార్చబడిన ఈ సర్వీస్ ఈ రోజు నుండి భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్
విప్లవాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇందుకు గాను మొదటి రెండు నెలలు
ప్రివ్యూ వినియోగదారుల కోసం తమ సర్వీస్ లను ఉచితంగా అందివ్వనున్నారు. అంతేకాకుండా
చందాదారులు వాపసు చేయదగిన సెక్యూరిటీ డిపాజిట్ రూ .2,500 ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ రోజు వాణిజ్యపరంగా తమ
సేవలను ప్రారంభించిన తర్వాత జియోఫైబర్ కోసం నమోదు చేసుకునే కొత్త కస్టమర్లకు 1,500 రూపాయలు తిరిగి
చెల్లించదగిన సెక్యూరిటీ డిపాజిట్‌ను అందించబడుతుంది. అంతేకాకుండా ఇన్‌స్టాలేషన్
ఛార్జీలు రూ.1,000 అవుతుంది అంటే
కొత్త చందాదారులు మొత్తం 2,500 రూపాయలు
చెల్లించాలి. అందులో 1,500 రూపాయలు తిరిగి
చెల్లించబడతాయి.
సెట్-టాప్-బాక్స్
వాణిజ్య ప్రయోగానికి ఒక
వారం ముందు జియో ఫైబర్ సెట్-టాప్-బాక్స్ చిత్రాలను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసారు.
మొదట తన అధికారిక వెబ్ సైట్ లో సెట్-టాప్-బాక్స్ యొక్క చిత్రాలను పోస్ట్ చేసారు.
టాప్ ప్యానెల్‌లో జియో స్టిక్కర్‌తో బ్లూ కలర్ సెట్-టాప్-బాక్స్ ఆన్ లైన్ లో
దర్శనం ఇచ్చింది. హైబ్రిడ్ సెట్-టాప్-బాక్స్‌లో HDMI పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్ మరియు రెండు USB పోర్ట్‌లు
ఉన్నాయి.
వెబ్‌సైట్ ప్రకారం Jio ఫైబర్ DTH UI టాటాస్కై కి చాలా
దగ్గర పోలిక ఉంటుంది. ఇది ఇటీవలి TRAI నిబంధనల ప్రకారం ఛానెల్‌లను అందిస్తుంది. జియో
ఫైబర్ సెట్-టాప్-బాక్స్ వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్‌తో వస్తుంది. ఇది వినియోగదారులను
లైవ్ టీవీ ఛానెల్‌లు మరియు OTT ప్లాట్‌ఫారమ్‌ల మధ్య వాయిస్ కమాండ్ల ద్వారా మారడానికి వీలు
కల్పిస్తుందని వెబ్‌సైట్ తెలిపింది. రిమోట్‌లో నంబర్ ప్యాడ్‌లు, వాల్యూమ్ మరియు
ఛానల్ నావిగేషన్ బటన్లు మరియు ప్రత్యేక సినిమా బటన్ కూడా ఉన్నాయి. కొన్ని ఇతర
డిటిహెచ్ రిమోట్ల మాదిరిగానే జియో ఫైబర్ టివి రిమోట్ కూడా టివిని నియంత్రించడానికి
మిమ్మల్ని అనుమతిస్తుంది.